📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ ను వేగవంతం చేయాలి

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ ను వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ ను వేగవంతం చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

*మన ప్రజావాణి*
మంచిర్యాల సెప్టెంబర్ 30

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని దండేపల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నిర్వహించిన విచారణలకు సంబంధించిన కేసుల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని, తదుపరి 2 రోజులలో పురోగతిని స్పష్టంగా చూపించాలని అధికారులను ఆదేశించారు. సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను అనుసరించి నియమ నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, మీ-సేవా ధ్రువపత్రాలను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు
అంతకుముందు జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రైండ్లగూడ గ్రామంలోని సర్వే నంబర్లు 160, 161 కి సంబంధించిన “అల్లం వారి కుంట” అంశంపై ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై కలెక్టరేట్ సూపరింటెండెంట్-బి, జన్నారం నీటిపారుదల శాఖ ఎఈఈ లతో కలిసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఫిర్యాదుదారుల వాదనలు విని, సమస్యకు సంబంధించిన అంశాలను పరిశీలించి, జన్నారం తహసిల్దార్, మండల గిర్దావర్‌కు తదుపరి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.