📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి వైఖరి

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి వైఖరి

📰 Generate e-Paper Clip

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి వైఖరి

* శోచనీయంసభ్యత్వ అభియాన్ లో తపస్

* కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు

జమ్మికుంట సెప్టెంబర్ 7 (ప్రజావాణి)

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సభ్యత్వ అభియాన్ లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వావిలాల తనుగుల బిజిగిరి షరీఫ్ గండ్రపల్లి విలాసాగర్ కోరపల్లి శాయంపేట ధర్మారం కొత్తపల్లి మడిపల్లి జమ్మికుంట తదితర పాఠశాలలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విచ్చేసిన తపస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు మాట్లాడుతూ  ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి గత మూడు సంవత్సరాలుగా పి ఆర్ సి పెండింగ్ లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ఇంకా రెండు సంవత్సరాలు ఆగమని చెప్పడం ఉద్యోగులుఉపాధ్యాయులు పెన్షనర్లు సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే తనను బెదిరిస్తున్నారని మాట్లాడడం అత్యంత శోచనీయమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకొని పిఆర్సి నివేదిక తెప్పించుకొని 53% ఫిట్మెంట్తో పి ఆర్ సి ని అమలు చేయాలని, పెండింగ్ లోనున్న ఆరు డి ఏ లను విడుదల చేయాలని ఉద్యోగుల పెన్షనర్ల  పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ అర్హత పరీక్ష నుండి మినహాయించాలని అదేవిధంగా విద్యా వ్యవస్థను గందరగోళానికి గురి చేసే పాఠశాల విద్యార్థులకు సంబంధించిన పరీక్ష జవాబు పత్రాలను బాహ్య మూల్యాంకనం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని కేజీబీవీ లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినిమం టైమ్స్ స్కేల్ ప్రకటించాలని ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాలను 010 పద్ధు కింద చెల్లించాలని,వారి సర్వీసులను పాఠశాల విద్యా శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమికప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదులో మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైరి సురేష్ జిట్టవేణి శ్రీను జిల్లా మండల బాధ్యులు జి కుమారస్వామి డి రవి కిరణ్ వేముల మల్లికార్జున్ అశోక్ సంపత్ రాజేందర్ సంతోష్ లంక శిరీష స్నేహలత స్వర్ణ రేణుక లతోపాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొని తపస్ ను బలపరుస్తూ సభ్యత్వం స్వీకరించడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.