📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఉదయం నుండి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ లో భాగంగా అలసిపోయిన శాబాదు రెవెన్యూ యంత్రాంగం..

ఉదయం నుండి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ లో భాగంగా అలసిపోయిన శాబాదు రెవెన్యూ యంత్రాంగం..

📰 Generate e-Paper Clip

ఉదయం నుండి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ లో భాగంగా అలసిపోయిన శాబాదు రెవెన్యూ యంత్రాంగం..

రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 11. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయా గ్రామాల నుండి వచ్చిన రైతులు మరియు నగరాల నుండి వచ్చిన భూ యజమానులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రెవెన్యూ కార్యాలయంలో క్యూలో నిలబడడంతోపాటు కార్యాలయ ప్రాంగణంలో అలసిపోయి కూర్చున్నారు. ముఖ్యంగా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఎలాగైనా తమ పనులను ముగించుకొని పోవాలని రిజిస్ట్రేషన్ కొరకు క్యూలో నిలబడ్డారు.

షాబాద్ తహసిల్దార్ అన్వర్ వివరణ….

శుక్రవారం ఉదయం కార్యాలయం సమయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రైతుల భూముల రిజిస్ట్రేషన్ లో అధికారులు అలసిపోయారని షాబాద్ తాసిల్దార్ అన్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం వరకు అయినా రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అలసి పోయినప్పటికీ.పనుల్లో జాప్యం జరగదు అన్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో రైతులు నగరాల నుండి మరియు గ్రామాల నుండి ప్రజలు ఎలాగైనా తమ పనులు ముగించుకొని పోవడానికి తాపత్రయ పడుతున్నారని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.