నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లిన ఆశా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ గౌడ్ ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం చండూరు మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలపై ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనవ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల వలన కార్మిక వర్గానికి అందుతున్న కొద్దిపాటి ప్రయోజనాలను కూడా దూరం చేయడానికి కార్పొరేట్లకు ప్రయోజనాలు కలిగించేందుకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరున సమస్యలను తీసుకొని రావడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని ఆరోపించారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక వర్గం గత ఐదు సంవత్సరాలుగా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిందని అన్నారు. కోడ్ల కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు నిర్వహించగా 30 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను మా రాష్ట్రాలలో అమలు చేయమని కేరళ పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలలో అసెంబ్లీ లో తీర్మానాలు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ఇండస్ట్రియల్ డిస్ప్లే యాక్ట్ 1947 ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యాక్ట్ కలిపి సంఘం పెట్టుకునే హక్కు మీద దాడి చేస్తున్నారని 1926 లో బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక హక్కులను వంద సంవత్సరాల తర్వాత మోడీ ప్రభుత్వం హరించి వేయడం అన్యాయమని రేడియన్ గుర్తింపు యజమానులు ప్రభుత్వాల దయాదాక్షిన్యాల కు వదిలేయడం సిగ్గుచేటు అని అన్నారు. 300 మంది లోపు కార్మికుల ఉన్న పరిశ్రమల లే ఆఫ్ లాకౌట్ లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా చేయడం ఐరన్ ఫైర్ సిస్టం ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ సిస్టం తీసుకురావడం ఉద్యోగ భద్రతకు స్వస్తి పలకడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కట్ట పద్మ, నాగమణి, వరలక్ష్మి, జ్యోతి, వేదవతి, పరమేశ్వరి, భాగ్య లక్ష్మి, శివలక్ష్మి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

