📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.చండీశ్వరి దేవి బాధ్యతల స్వీకరణ

ములుగు జిల్లా  ప్రతినిధి (ప్రజావాణి):

ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.చండీశ్వరి దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.పదోన్నతి ప్రాతిపదికన యాదాద్రి భువనగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆమె ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమెకు న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కార్యదర్శి కె.చండీశ్వరి దేవి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, లోక్ అదాలత్ లు మరియు న్యాయ అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే తన ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న వివిధ న్యాయ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు, సిబ్బంది, ప్యానల్ న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.