📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguస్టే అలర్ట్ స్టే అవేర్ స్టే సైబర్ సేఫ్–విద్యార్థులకు ఎస్పీ పిలుపు

స్టే అలర్ట్ స్టే అవేర్ స్టే సైబర్ సేఫ్–విద్యార్థులకు ఎస్పీ పిలుపు

📰 Generate e-Paper Clip

  • .ములుగులో సైబర్ భద్రతపై 500 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.
    .సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం – జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐపీఎస్.

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)*

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురక్షా కా తిరంగా” కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా KYC మోసాలు, డీప్ పేస్ ఫేక్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, సోషల్ మీడియా ఫేక్ ప్రొఫైల్ మోసాలు, పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్) మోసాలు, ఫేక్ లింక్స్ మోసాలు వంటి సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.అలాగే,తెలియని వ్యక్తులతో వ్యక్తిగత, బ్యాంకు, OTP, PIN వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు.అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా ముందుగా ధృవీకరించుకోవాలని తెలిపారు.సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రొఫైల్స్, డీప్ ఫేక్ వీడియోలు, అధిక లాభాల పేరుతో వచ్చే పెట్టుబడి ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని వివరించారు.
ఇంస్టాగ్రామ్, ఫేసుబుక్ వంటి మాద్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని మోసపోవద్దని సూచించారు.ఎవరైనా పోలీసుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు లేదా వ్యక్తిగత వివరాలు అడిగితే నమ్మవద్దని, పోలీసులు ఫోన్ ద్వారా డబ్బులు అడగరని స్పష్టం చేశారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకొని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఎస్ పి ప్రజలను ఉద్దేశిస్తూ అప్రమత్తంగా ఉండండి – అవగాహన పెంచుకోండి – సైబర్ నేరాల నుండి సురక్షితంగా ఉండండి అని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, పస్రా సీఐ దయాకర్, ములుగు సీఐ దారం సురేష్, సీసీఎస్ సీఐ బండారి కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, వెంకటాపూర్ ఎస్‌ఐ చల్లా రాజు, పస్రా ఎస్‌ఐ తాజుద్దీన్, ములుగు ఎస్‌ఐ వెంకటేష్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.