📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguవనమహోత్సవం ఘనంగా నిర్వహణ

వనమహోత్సవం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

 

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో మంగళవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కటాపూర్ గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఎఫ్ డి ఓ వజ్రరెడ్డి, ఎఫ్ఆర్ఓ శ్రావణి, తాడ్వాయి ఎమ్మార్వో సురేష్, కటాపూర్ సర్పంచ్ దిద్ది మోహనరావు పాల్గొన్నారు. అలాగే పసర సెయింట్ మేరీస్ పాఠశాల విద్యార్థులు, ప్రిన్సిపాల్ , వేణు మరియు ఉపాధ్యాయులు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.