📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadరేవంత్ రెడ్డి,కేసిఆర్ సంక్షేమ పథకాలను చంపుతున్నారని బీఆర్ఎస్ నాయకుల ఫైర్.

రేవంత్ రెడ్డి,కేసిఆర్ సంక్షేమ పథకాలను చంపుతున్నారని బీఆర్ఎస్ నాయకుల ఫైర్.

📰 Generate e-Paper Clip

రేవంత్ రెడ్డి,కేసిఆర్ సంక్షేమ పథకాలను చంపుతున్నారని బీఆర్ఎస్ నాయకుల ఫైర్.

కేసీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్.

సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక.

కేటీఆర్ ఆదేశాలతో కోటగిరిలో బీఆర్ఎస్ ఆందోళనలు, ధర్న.

 

కోటగిరి/ప్రజావాణి:-చంద్రబాబు పాలన మెప్పుకై తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి చంపుతున్నాడని కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ నాయ కులు తేల్ల రవి కుమార్ విమర్శించారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యాలయం ఎదుట మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ తో పాటు ఇతర సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.అనంతరం ఎంఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తేల్ల రవి కుమార్,మోరే కిషన్ మాట్లాడుతూ.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను విస్మరించి విధ్వంసకర పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు.సీమాంధ్ర నాయకుల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని.కాంగ్రెస్ పాలన ఎవరి డైరెక్షన్లో నడుస్తుందో ప్రజలందరికీ తెలుసు అని వారు విమర్శించారు.కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రజారంజక పథకాలను సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.గతంలో సీమాంధ్ర నాయకులు తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని అపోహలు సృష్టించారని కానీ కెసిఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందని గుర్తు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి యొక్క గురువు చంద్ర బాబు పాలనను పొగుడుతూ తెలంగాణలో సంక్షేమ పథకాలను బొంద పెడుతున్నాడని మండిపడ్డారు.గతంలో కెసిఆర్ కాలంలో ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం చేరేదనీ.ప్రస్తుతం అన్ని పథకాలు అంధకా రంలోకి వెళ్తున్నాయనీ.రైతు బీమా పథకానికి ప్రీమియం కూడా చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజా ఉపయోగ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో దేవేందర్ రావు,శ్రీనివాస్ గౌడ్,శంక ర్ గౌడ్, ఫారుక్,కప్ప సంతోష్,తేల్ల చిన్న అరవింద్,నజీర్, అంబాటి గంగా ప్రసాద్ గౌడ్,గగన్,కర్నె గజేందర్,మంజునా థ్,మారుతి,ఉమాకాంత్,విజయ్,జలాల్,హన్మండ్లు,జయసూర్య, శ్రీనివాస్,పాల గంగారం,సందీప్,మామిడి నవీన్, పాషా,శివ,ఆంజనేయులు,రవి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.