హుజుర్నగర్, ఆగస్టు 25/ ప్రజావాణి
రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పద్మశాలి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రిని కలసి పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడిన పద్మశాలి సామాజికవర్గ నాయకులకు, కార్యకర్తలకు రాబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో తగిన ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. పద్మశాలి సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

