బెజ్జంకి, ఆగస్టు 30 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, UPS, కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూల్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు మండల స్థాయి SGF క్రీడా పోటీలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు SGF క్రీడల నిర్వహణ కమిటీ తెలిపింది. బెజ్జంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర క్రీడా మైదానంలో పోటీలు జరగనున్నాయి.ఈ యొక్క పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మాలో పూర్తిగా నింపి ఆగస్టు 31 సాయంత్రంలోపు ఎంట్రీలు, నిర్ణీత ఎంట్రీ ఫీజుతో సహా సమర్పించాలని కమిటీ సూచించారు.అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించి గడువులోగా ఎంట్రీలు సమర్పించాలని కోరారు.మరిన్ని వివరాలకు మాలతి, PD – 9949453619ను సంప్రదించాలని తెలిపారు.

