📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyచెరువులో దూకి మహిళ ఆత్మహత్య

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన చాకలి సత్తమ్మ (70) కుటుంబ కలహాల కారణంగా గతంలో తన కుమార్తె ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో మానసికంగా బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో తరచూ ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్పేది.

తేదీ 17.08.2026 రాత్రి మంగలోని గుట్ట చెరువులో దూకేందుకు వెళ్లగా గ్రామస్థులు గమనించి ఇంటికి తీసుకువచ్చారు. అయితే 18.08.2026 తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయిన సత్తమ్మ, అదే చెరువులో మృతదేహంగా కనిపించింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సత్తమ్మదిగా గుర్తించారు. జీవితంపై విరక్తితో ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు, ఈ ఘటనపై ఎవరికీ అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.