📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట లో ఆర్ అండ్ బి రోడ్డు పనులు మందకొడిగా -...

చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట లో ఆర్ అండ్ బి రోడ్డు పనులు మందకొడిగా – ప్రజల ఇక్కట్లు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో జరుగుతున్న అండ్ బి రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తరబడి పనులు పూర్తి కాన నెల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

*ప్రజల ఆవేదన*
“రోడ్డు పని ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కాంట్రాక్టర్ ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నందున రోజూ దుమ్ము ధూళి, కంకర రాళ్ళతో ఇబ్బందులు పడుతున్నాం” అని మహిళలు వాపోతుంటారు.

*ప్రజల డిమాండ్*
ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ రోడ్డు పనులను పూర్తి చేసి అంగడిపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

*అధికారులకు విజ్ఞప్తి:*
“ఇప్పటికైనా కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి, నాణ్యతతో రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి. లేకపోతే ఆందోళనకు దిగుతాం” అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.