📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguగొడవలు వద్దు - రాజీలు ముద్దు.

గొడవలు వద్దు – రాజీలు ముద్దు.

📰 Generate e-Paper Clip

 

వివాదాలు పెంచుకోవాలంటే జీవితకాలం కొనసాగుతాయి. కలిసి ఉందామని నిర్ణయించుకుంటే ఇప్పుడే సమసిపోతాయి.
మీరే తేల్చుకోండి – వివాదాలు కావాలా? రాజీలు కావాలా?
.పసర ఎస్సై తాజుద్దీన్.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-

గోవిందరావుపేట పరిధిలోని ప్రజలు నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పస్రా పోలీసులు కోరారు. గొడవలు వద్దు రాజీలు ముద్దు అని, వివాదాలు పెంచుకుంటే జీవితకాలం ఉంటాయని, రాజీ పడితే ఇప్పుడే సమసిపోతాయని సూచించారు. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 12 వరకు JFCM ములుగు కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందని తెలిపారు. యాక్సిడెంట్, కొట్టుకోవడం, చీటింగ్, వైవాహిక, చిన్న దొంగతనం తదితర రాజీ పడదగిన కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఫిర్యాదుదారుడు, నిందితులు ఆధార్ కార్డుతో కోర్టుకు హాజరైతే కేసు పూర్తిగా క్లోజ్ అవుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.