కండ్లకోయలో గుర్తుతెలియని మహిళ మృతదేహం
గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని: కండ్లకోయ ప్రాంతంలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
మృతురాలి వివరాలు, గుర్తింపు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహిళను ఎవరైనా గుర్తించినట్లయితే లేదా ఆమెకు సంబంధించిన వివరాలు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

