📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను అవమానించిన బీజేపీ నేతల వైఖరి కి నిరసనగా సంగారెడ్డి...

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను అవమానించిన బీజేపీ నేతల వైఖరి కి నిరసనగా సంగారెడ్డి లో కాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీ

📰 Generate e-Paper Clip

  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను అవమానించిన బీజేపీ నేతల వైఖరి కి నిరసనగా సంగారెడ్డి లో కాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీ

*కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ* *పాల్గొన్న ఏఐసీ సి అబ్జర్వర్ దీపక్ రాథోర్, జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, నేరెళ్ల శారద,రియాజ్, దుద్దిళ్ల శ్రీనివాస్*ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు ‘శుద్ధీకరణ’ పేరుతో గంగాజలంతో శుభ్రం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కుల, మత విద్వేషాలతో దేశాన్ని విభజించే ప్రయత్నాలను తిప్పికొడతామని నాయకులు స్పష్టం చేశారు.సంగారెడ్డిలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యం లో బీజేపీ నాయకుల చర్యలకు నిరసనగా చేపట్టిన ధర్నా కార్యక్రమం లో ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోర్ తో సహా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నేరెళ్ల శారద, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రియాజ్ , దుద్దిళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఐబీ నుండి మొదలుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు, అనంతరం క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న పూలే, జగజ్జీవన్ రామ్ విగ్రహాల పూల మాలలు వేసి నివాళులు అర్పించారు . దేశ ఐక్యత, సమగ్రత, సౌహార్దం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడతారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏఐసిసి అబ్జర్వర్ దీపక్ రాథోర్ మాట్లాడుతూ చంద్ర మండలం కు ప్రయాణిస్తున్న ఈ కాలం లో కూడా బీజేపీ నేతలు దళితుల పట్ల వివక్ష ను చూపిస్తున్నారని ద్వజమెత్తారు. మల్లిఖార్జున ఖర్గే దళితుడు కావడం వల్లే శుద్దీకరణ చేశారని, కులం మతం పేరుతో బీజేపీ నాయకులు దేశాన్ని విభజిస్తున్నారని ద్వజమెత్తారు. ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు విద్యార్థులు, యువత, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కారాల కోసం కృషి చేస్తున్నార న్నారు .సమాజంలో ఐక్యత, పరస్పర సౌహార్దం, సామరస్యం కొనసాగాలని ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు .*జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది*కాంగ్రెస్ ‘సంఘటన్ సృజన్’ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాఠోర్ తెలిపారు. మరో 5–7 రోజుల పాటు జిల్లాలో పర్యటించి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.