📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే పిఆర్సిని పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల...

ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే పిఆర్సిని పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే పిఆర్సిని పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలి

నడికూడా మండలంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల యుపిఎస్సి అండ్ జెడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులు డిమాండ్

నడి కూడా ప్రజావాణి ఆగస్టు 7

 

నడికూడ: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూ ఎస్ పి సి) నాయకుడు రావుల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యూఎస్‌పీసీ పిలుపు మేరకు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

 

ఈ సందర్భంగా రావుల రమేష్ మాట్లాడుతూ, 2024 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్సీని మూడేళ్లు గడిచినా ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు డీఏలను పెండింగ్‌లో ఉంచి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు దారితీస్తున్న జీవో నెం.25కు వెంటనే సవరణలు చేయాలని కోరారు. అలాగే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కోర్టు తీర్పు మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 

ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలను ఉద్ధృతం చేసి, రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

 

ఈ నిరసన కార్యక్రమంలో నడికూడ  మండలంలో ఉన్న ఉద్యోగ సంఘాలు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.