ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి తహసిల్దార్ కువినతి పత్రం బిజెపి నాయకులు
* బిజెపిమండల అధ్యక్షుడు దొంతరవేన రమేష్ యాదవ్
జమ్మికుంట ఆగస్టు 21 (ప్రజావాణి)
భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారుమండలంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ వినతిపత్రం అందజేశారుఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దొంతరవేన రమేష్ యాదవ్ మాట్లాడుతూ జమ్మికుంట మండలంలోని ప్రజలు గృహ నిర్మాణ పనులకు అలాగే ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుక అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని జమ్మికుంట మండలంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని తహసిల్దార్ ను కోరినట్లుచెప్పారుజమ్మికుంట మండలానికి ఇసుక రీచ్ ఏర్పాటు చేయకపోతే ప్రజలతో కలిసి బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తహసిల్దార్ కు వినతిపత్రం ద్వారా తెలియజేసినట్లు మండల అధ్యక్షుడు రమేష్ తెలిపారుఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, సర్పంచులు కేవిడే కుమార్ స్వామి గరికడి శ్రీధర్ నాయకులు పుల్లూరి ఈశ్వర్ నాగపురి విక్రమ్ కొట్టాల మల్లేష్ భీమిలి వెంకటేశ్వర్లు శెట్టి హరీష్ కనబోయిన సమ్మయ్య భీమిలి కిషన్ రావు గరిగంటి శ్రీధర్ లింగమూర్తి శ్రీనివాస్ ఆవుల తిరుపతి అశోక్ తదితరులు పాల్గొన్నారు

