📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఆగస్టు-10 న జరిగే "జైల్ బరో" కు మద్దతు

ఆగస్టు-10 న జరిగే “జైల్ బరో” కు మద్దతు

📰 Generate e-Paper Clip

*ఆగస్టు-10 న జరిగే “జైల్ బరో” కు మద్దతు*

–భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ.ఎఫ్.టి.యు)
జాతీయ కార్యదర్శి షేక్ షావలి, రాష్ట్ర అధ్యక్షులు కె.కిషన్ పంపిన పత్రిక ప్రకటనలో వెల్లడి.

  జవహర్ నగర్,ఆగస్టు 8 (ప్రజావాణి ప్రతినిధి )

బీజేపీ నరేంద్రమోదీ, అమిత్ షాల ప్రభుత్వం చేపట్టిన రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగష్టు-10 న జరిగే దేశవ్యాప్తంగా జైల్ బరో  కార్యక్రమానికి
సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుకు భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ.ఎఫ్.టి.యు) జాతీయ కార్యదర్శి షేక్ షావలి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.కిషన్ నేడొక ప్రకటనలో తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
2026, ఆగష్టు-8, శనివారం రోజున విలేకరులకు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో
సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు తమ సంపూర్ణ నైతిక మద్దతును అందజేయాలని వారు ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. సీ2+50% ఫార్ములా ప్రకారం ఎం.ఎస్.పి. కి చట్టబద్ధ భద్రత మరియు ప్రభుత్వ కొనుగోలు హామీ కల్పించాలని, రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేసి, రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ఇండియా, యూఎస్ సహా అన్ని రకాల స్వదేశీ, విదేశీ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించి, కార్పొరేట్లకు లాభాలు, రైతులకు నష్టాలు చేకూర్చే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. నాలుగు కార్మిక లేబర్ కోడ్లను, 2025 విద్యుత్ సవరణ చట్టాలను రద్దుచేయాలని లేదంటే సంయుక్త కిసాన్ మోర్చా, మరో పది జాతీయ కార్మిక సంఘాలు భవిష్యత్తులో చేపట్టబోయే రైల్ రోకో, రాస్తా రోకో లాంటి తదితర ప్రజా ఉద్యమాలకు గురికాక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అప్రజాస్వామిక ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్థి పలికేలా నరేంద్రమోదీ ప్రభుత్వంపై
వివిధ సెక్షన్ల ప్రజానీకంతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.