టేకుమట్ల/ప్రజావాణి: టేకుమట్ల మండలం లో గర్మిళ్లపల్లి రక్షాబంధన్ప పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకున్నారు. సోదరులు సైతం తమ సోదరీమణులకు బహుమతులు అందించి, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకోవడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేశారు.
అన్నాచెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్

