📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalఅంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

చెన్నారావుపేట ఆగస్టు 03 ప్రజావాణి

చెన్నారావుపేట స్థానిక నెంబర్ వన్ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు సోమవారం అంగన్వాడి టీచర్ దేవమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.బిడ్డ పుట్టిన తర్వాత గంటలోపు ముర్రుపాలు పట్టాలని తొలి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని ఏఎన్‌ఎమ్ తెలిపారు.తల్లి పాలు పిల్లలకు పట్టడం వల్ల పిల్లలు తల్లులు ఆరోగ్యంగా ఉంటారనీ ముఖ్యంగా తల్లులకు రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉంటారని తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, బాలఅమృతం యొక్క ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలకు బాలఅమృతం, గుడ్లు, టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు కవిత, ఏఎన్‌ఎమ్ పుష్ప,ఆశా కార్యకర్తలు వసుమతి, అనిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.