📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetసుల్తాన్ పురం గ్రామంలో ఘనంగా తీజ్ పండుగ.

సుల్తాన్ పురం గ్రామంలో ఘనంగా తీజ్ పండుగ.

📰 Generate e-Paper Clip

సుల్తాన్ పురం గ్రామంలో ఘనంగా తీజ్ పండుగ.

మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని సుల్తాన్ పురం గ్రామంలో బంజారాల సాంప్రదాయ అతిపెద్ద పండగ అయిన తీజ్ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. తొమ్మిది రోజులు పెళ్లి కానీ యువతులు మేరమా యాడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అదేవిధంగా గ్రామస్తులందరూ ఇట్టి పండుగను వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, పశువులు బాగుండాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ పండుగ తీజ్ పండుగ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. అదే విధంగా చక్కటి వాతావరణం లో గ్రామ ప్రజలు, బంధువుల సమక్షంలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూక్య కొండ, బానోతు శ్రీను, ధరావత్ సైదులు, భూక్య బాలయ్య, మాలోతు రాజు, మాలోతు బాలు, నరసింహ, భూక్య రెడ్యా, బానోతు కొండ, ఆంజనేయులు, గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు, పిల్లలు, బంధుమిత్రులు అందరూ పాల్గొని తీజ్ పండుగ నిర్వహించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.