📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialసింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మెగా ప్లాంటేషన్

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మెగా ప్లాంటేషన్

📰 Generate e-Paper Clip

జైపూర్ ,జూలై21,ప్రజావాణి:

 

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ‘మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ ఉత్పత్తితో దేశ, రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతూనే, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. బొగ్గు ఆధారిత ప్లాంట్ల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి, పర్యావరణాన్ని సమతుల్యం చేయడం కోసమే ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్లాంటు ఈడీ సిహెచ్ చిరంజీవి, జీఎం ఎం. నరసింహ రావు, ఇతర ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.