📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు

ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు

📰 Generate e-Paper Clip

 

రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరికాసేపట్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా గొర్రెల కాపర్లు, బర్రెల కాపర్లు తమ పశువులను నది పరివాహక ప్రాంతాలు, వాగులు, నీటి ప్రవాహ ప్రాంతాల వైపు తీసుకెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.