📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetజూన్ 20న జాతీయ లోక్ అదాలత్.. రాజీ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం.. ప్రజలు ఈ...

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్.. రాజీ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్

📰 Generate e-Paper Clip

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్

రాజీ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్

సిద్దిపేట, జూన్ 18, ప్రజావాణి

జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ ద్వారా పరిష్కరించుకునే కేసుల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.కంపౌండబుల్ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వివాదాలు, రోడ్డు ప్రమాద పరిహార కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్, చెక్ బౌన్స్ తదితర రాజీకి వీలున్న కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించాలని సూచించారు.చిన్న చిన్న వివాదాలను కొనసాగిస్తూ కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, జుడిషియల్ శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్‌లో రాజీకి అనుకూలమైన కేసులను గుర్తించి, ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందడంతో పాటు కేసులు శాంతియుతంగా ముగిసే అవకాశం ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.