📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialకోతుల కొట్లాట: తలపై ఇటుక పడి మహిళ మృతి

కోతుల కొట్లాట: తలపై ఇటుక పడి మహిళ మృతి

📰 Generate e-Paper Clip

ధర్మపురిలో కోతుల కొట్లాట ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన కొనపర్తి పద్మ బుధవారం సాయంత్రం తన ఇంటి ముందు కూర్చుని మరో మహిళతో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఇంటి రేకులపై కోతులు తీవ్రంగా గొడవపడ్డాయి. ఈ క్రమంలో రేకులు లేవకుండా బరువు కోసం పెట్టిన సిమెంట్ ఇటుకను కోతులు కిందికి పడేశాయి. అది నేరుగా పద్మ తలపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.