📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్22 (ఎ) కేసులు పక్కాగా విచారణ చేయాలి,,జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు.

22 (ఎ) కేసులు పక్కాగా విచారణ చేయాలి,,జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు.

📰 Generate e-Paper Clip

గుంటూరు,జిల్లా ప్రజావాణి న్యూస్  (మే11) జిల్లాలో 22 (ఎ) కేసులు పక్కాగా విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు.సోమవారం మధ్యాహ్నం రెవెన్యూ,రీ సర్వే,జి రామ్ జి అంశాలపై జిల్లా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసిల్దార్ విధిగా వ్యక్తిగతంగా తనిఖీ చేయాలన్నారు.రెవెన్యూ డివిజనల్ అధికారులు విధిగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. క్లాసిఫికేషన్ ఖచ్చితంగా ఉంటే జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు.అభ్యంతరకర పోరంబోకుగా ఉన్న జల వనరుల ప్రదేశం,చెరువులను స్పష్టంగా విచారణ చేపట్టి, నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో 22 (ఎ) క్రింద ఉన్న వాటిని శుక్రవారం నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. రిసర్వేను నాణ్యంగా చేయాలని ఆదేశించారు. రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.ఉపాధి హామీ పనుల వేతనదారుల సంఖ్య పెరగాలి జిల్లాలో వేతనదారుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ఆదేశించారు.మేడికొండూరు,వట్టిచెరుకూరు ప్రత్తిపాడు, ఫిరంగిపురం మండలాల్లో పరిస్థితీ బాగా మెరుగుపరచాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ఎస్.జి.ఎస్.డబ్ల్యూ సేవలు త్వరగా అందాలిప్రజలు వివిధ అవసరాలకు దరఖాస్తు చేసుకున్న సేవలను త్వరగా అందించాలని ఆదేశించారు.నిర్దేశిత సమయంలోనే సేవలు అందాలని అన్నారు.రెవిన్యూ క్లినిక్ లకు తహసిల్దార్ లు హాజరు కావాలని,అదే సమయంలో మండలాల్లో ఉప తహసిల్దార్ లు పి.జి.ఆర్.ఎస్ విధిగా నిర్వహించాలని ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో సైతం పి.జి.ఆర్.ఎస్ విధిగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ,జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్,జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్.కృష్ణ జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం,జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన,జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి,కె.ఆర్.ఆర్.సి డిప్యూటీ కలెక్టర్ గంగ రాజు,సర్వే ఉప సంచాలకులు తోయజాక్షజ రావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.