📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఅంతర్జాతీయంస్థానిక ప్రజాప్రతినిధి చొరవతో చెట్టు తొలగింపు

స్థానిక ప్రజాప్రతినిధి చొరవతో చెట్టు తొలగింపు

📰 Generate e-Paper Clip

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం టొంకిని గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఓ భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై చెట్టు అడ్డంగా పడిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధి రాందాస్ అతని సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో రహదారిపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. త్వరితంగా స్పందించి సమస్యను పరిష్కరించిన రాందాస్‌కు స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.