📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaకో-ఆప్షన్ సభ్యురాలిగా అల్లాడి విజయ ఏకగ్రీవ ఎన్నిక

కో-ఆప్షన్ సభ్యురాలిగా అల్లాడి విజయ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

కో-ఆప్షన్ సభ్యురాలిగా అల్లాడి విజయ ఏకగ్రీవ ఎన్నిక

*జూపల్లి దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన అల్లాడి విజయ.

అశ్వారావుపేట,ప్రజావాణి న్యూస్ మే 30: అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గంలో కో-ఆప్షన్ సభ్యురాలిగా అల్లాడి విజయ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం స్థానిక రాజకీయ వర్గాల్లో హర్షాతిరేకాలకు దారి తీసింది. తొలిసారిగా కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గంలో నిర్వహించిన కో-ఆప్షన్ ఎన్నికలో అల్లాడి విజయకు ఏకగ్రీవ మద్దతు లభించడంతో ఆమె ఎన్నిక ఖరారైంది.ఈ సందర్భంగా అల్లాడి విజయ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నుకున్న మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, వార్డు కౌన్సిలర్లు మరియు పాలకవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ మాట్లాడుతూ అల్లాడి విజయ ఎన్నికతో పాలకవర్గానికి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్, దిలీప్ రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు,తుమ్మ రాంబాబు, యువజన నాయకుడు జూపల్లి ప్రమోద్ బాబు, నండ్రు రమేష్, అల్లాడి రామారావు, డాక్టర్ గౌస్,గుమ్మళ్ల గోపి, పుట్టి మురళి, దగ్గుమిల్లి నరేంద్ర, అల్లాడి నాగరాజు,అల్లాడి రామకృష్ణ,వార్డ్ కౌన్సిలర్స్,మున్సిపల్ సిబ్బంది, ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొని అల్లాడి విజయకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.