📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriరాజ్యాంగ నిర్మాతకు కాంగ్రెస్ టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి బాలగౌని వెంకటేష్ గౌడ్ ఘన నివాళులు

రాజ్యాంగ నిర్మాతకు కాంగ్రెస్ టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి బాలగౌని వెంకటేష్ గౌడ్ ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, ఏప్రిల్ 14 (ప్రజావాణి): భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం పోచారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలోనీ ఆర్ జీ కే కాలనీ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమనికి కాంగ్రెస్ టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగౌని వెంకటేష్ గౌడ్ పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కీర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం సభ్యులు కాలనీవాసులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.