📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో పతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా...

ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో పతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు..

📰 Generate e-Paper Clip

 

సిద్ధిపేట 10 ఏప్రిల్, ప్రజావాణి

ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో పతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి ఓపి వార్డులు మరియు మెడిసిన్ పంపిణీ కేంద్రంలోకి వెళ్ళి మెడిసిన్ తనికి చేశారు. మందులు ఇవ్వడమే కాకుండా వాటిని ఎలా వాడాలీ, ఆహారపు అలవాట్లు గూర్చి క్లుప్తంగా వివరించాలని డాక్టర్లను ఆదేశించారు. పలువురు రోగులతో మాట్లాడుతూ మోకాలి నొప్పులు, డైజేషన్ సమస్యలు ఇతరత్ర సమస్యలు ఉన్న ఈ ఆయుష్ లోనే వైద్యం చేయించుకోవాలని ఈ మందులు వాడితే పులుపు ఆహారానికి దూరంగా ఉండాలని, మొక్కజొన్న పజ్జోన్న గడ్కా మరియు రాగి జావా లాంటివి తాగితే దృఢంగా ఉంటారని మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో థీమ్ తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ వారం హెల్త్ వీక్ కి కేటాయించిన సందర్భంగా ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఆయుర్వేదిక్, యునాని, హోమియో పతి వైద్య సేవల గూర్చి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి సేవలను చికిత్స మరియు ఉచితముగా మందులు అందించడం జరుగుతుందని జిల్లా కేంద్రం అతి సమీపంలో ఉన్నందున ఈ 50 పడకల ఆసుపత్రిలో 24/7 ఓపి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ ఆయుష్ కేంద్రంలో వైద్యం చేయించుకుంటే తప్పకుండా నయమవుతుందని సూచించారు. ఈ కేంద్రంలో భవిష్యత్ లో అవసరం ఉన్నవారికి సర్జరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ వైద్య శాలలో మెడిసిన్ ప్రకృతిలో దొరికే మూలికలతో తయారు చేస్తారు. కావున వైద్యం చేయించుకుంటే మందులు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సూచించారు.ఆయుష్ కేంద్రం లో చేస్తున్న వైద్యం గూర్చి విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కేంద్రం మరియు జిల్లా నలుమూలల నుండి వచ్చి వైద్య సేవలు ఉపయోగించుకోవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గ్ మంజుల రాజ్ నర్సు, ఆయుష్ ఆసుపత్రి సూపరిండెంట్ ఉమాదేవి, ఇతర డాక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.