📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఅంతర్జాతీయందేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?

దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 13)ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం క్లైమాక్స్ కు చేరింది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా మార్గమైన హార్మూజ్ జలసంధిపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా బృందం మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస బెట్టి వార్నింగ్ లు ఇస్తున్నారు.హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామని తాజాగా హెచ్చరించారు. అందుకు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అమెరికాపై విరుచుకుపడుతోంది. అమెరికా అలా చేస్తే హార్మూజ్ సుడిగుండాల్లో ఆ దేశ సైన్యం కొట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చింది.ఇక తాజాగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో.. అమెరికా నేవీ ఫోర్స్.. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్ నుంచి వచ్చి పోయే నౌకలను అమెరికా నేవీ అడ్డుకుంటోంది. సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ ప్రక్రియను ప్రారంభించింది అమెరికా. ఇక ఇరాన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే హార్మూజ్ వద్ద భారత్ కు చెందిన దాదాపు 15 నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో అధికంగా ఎల్పీజీ, ముడి చమురు, ఎల్ఎన్జీ ఉంది. దాంతో భారత్ లో రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిటైల్ ధరలను పెంచని నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఐఓసీ, హెపీసీఎల్, బీపీసీఎల్ లు పెట్రోల్ పై లీటర్ కు రూ. 24 అలాగే డీజిల్ పై లీటర్ కు రూ. 30 వరకు నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎక్సైజ్ టాక్స్ ను లీటర్ కు రూ. 10 తగ్గించింది. అయితే భారత్ వద్ద ఇంకా దాదాపు రెండు నెలల వరకు సరిపడా నిల్వలు ఉన్నా .. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తే మన దేశానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఏప్రిల్ 14 నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.77 ఉండగా రేపటి నుంచి లీటర్ పెట్రోల్ ధర రూ. 102- 105 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 103 నుంచి రూ. 112 కు పెరిగే ఛాన్స్ ఉందట. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 102.92 నుంచి రూ. 110-113 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.