📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎస్సీ సంక్షేమ వసతి గృహం నుండి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థి అంతటి శృషిత

ఎస్సీ సంక్షేమ వసతి గృహం నుండి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థి అంతటి శృషిత

📰 Generate e-Paper Clip

డా. బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలొ ఇ.సి.ఐ.యల్ ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థిని అంతటి శ్రుషిత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి అంబేద్కర్ జయంతి వేడుకలలొ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మరియు సీతక్క చేతుల మీదుగా ఐదు వేల రూపాయల నగదు బహుమతి తో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. విద్యార్థి అంతటి శ్రుషిత సాధించిన ఈ విజయం పట్ల తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబెర్ గోగుల సరిత మరియు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు అందరు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె కృషి, పట్టుదల ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి అంతటి శృషితను మరియు సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతిని సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి యం.గోపీచంద్ మరియు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జి.వినోద్ కుమార్ అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.