📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:(మార్చి 11) కాశినాయన,కలసపాడు మండలం ముద్దుమారుపల్లి గ్రామానికి చెందిన సగిలి ఇమ్మానియేల్ (16) గత నెల 6 తేదీన పోరుమామిళ్ల మండలంలోని డంపింగ్ యార్డ్ సమీపాన రెడ్డి కథవా లో అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు పోరుమామిళ్ల వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.అలాగే కాశి నాయన మండలం గంగన్న పల్లె గ్రామానికి చెందిన కందుల దిలీప్ (25) గత నెల 22వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మార్చి రెండవ తారీఖున తిరుపతి సిమ్స్ లో చనిపోయాడు. దిలీప్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.వీరి ఇరువురి కుటుంబాలను పరామర్శించి మృతి చెందిన కారణాల గురించి అడిగి తెలుసుకున్న మందకృష్ణ మాదిగ.మృతుడు దిలీప్ ది ఆత్మహత్య కాదు ప్రేమ వివాద హత్యను అన్న మందకృష్ణ మాదిగ.పోలీసులు ఈ కేసులను నీరు కార్చకుండా సమగ్ర విచారణ జరిపించి హత్యకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్న మందకృష్ణ మాదిగ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.