📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ముందస్తు అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి..ఎస్ఎఫ్ఐ

ముందస్తు అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి..ఎస్ఎఫ్ఐ

📰 Generate e-Paper Clip

కడప ప్రజావాణి న్యూస్ మార్చి25 ముందస్తు అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలిఎ స్ఎఫ్ఐజిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి.కడ జిల్లాలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బుధవారం కడప నగరంలోని వారి కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి అన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ.రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసకముందే కడప జిల్లాలో అక్రమ ముందస్తు అడ్మిషన్లు చేయడం దుర్మార్గమని వారన్నారు.విద్యా సంవత్సరం పూర్తికాకముందే విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తుంటే జిల్లా విద్యాశాఖ అధికారులు చూస్తూ వారిపై చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య, నారాయణ, బాష్యం,NRI,విద్యాసంస్థలు అడ్మిషన్లు టార్గెట్ పేరుతో విచ్చలవిడిగా చేస్తున్న యాజమాన్యం పై అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదని వారు అన్నారు.చదువు పేరుతో ఇలా అక్రమంగా ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలపై జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ సమావేశం లో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దు రాహుల్, నగర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.