📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ

పోరుమామిళ్ల మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్: (మార్చి 09) పోరుమామిళ్ల  అక్రమ సంపాదనకు పాల్పడుతున్న మండల విద్యాశాఖ అధికారిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి.ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్న పోరుమామిళ్ల మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలని సోమవారం కడప కలెక్టర్ కార్యాలయంలోని జరుగుతున్న గ్రీవెన్స్ లో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పోరుమామిళ్ల మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా చదువు పేరుతో విద్యార్థుల వారి తల్లిదండ్రుల దగ్గరఅధికఫీజులతోదోపిడీచేస్తున్నయాజమాన్యంపైచర్యలుతీసుకోకుండావారి దగ్గర ముడుపులు తీసుకుంటూ వారి పక్షాన వ్యవహరిస్తున్న ఎంఈఓ వెంకటయ్య గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలుమార్లు విద్యాశాఖ అధికారి గారికి సమాచారం ఇచ్చిన ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమైన విషయం. చదువు పేరుతో మోసం చేసే వారిపై చర్యలు తీసుకునే అధికారిగా ఉంటూ వారికి తొత్తుగా వ్యవహరించడం సరికాదని వారన్నారు.అదేవిధంగా వారిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు సమస్య గురించి విన్నపించుకున్న లెక్క చేయని విధంగా ప్రవర్తించడం సరికాదని ఇప్పటికైనా అధికారులు నిద్ర వీడి ఎంఈఓ గారి పై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కడప నగర ఉపాధ్యక్షులు అఖిలేష్, కార్తీక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.