📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliసాధన కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

సాధన కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

📰 Generate e-Paper Clip

కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రిన్సిపల్ గాజానవేని కుమార్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మారం ఫిబ్రవరి 13 (ప్రజావాణి):

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలకేంద్రంలోని స్థానిక సాధన జూనియర్ కళాశాలలో వీడ్కోలు వేడుకలను శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, ఇందులో భాగంగా వారు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ…. కళాశాలను వదిలి వెళుతున్నందుకు బాధను వ్యక్తం చేస్తూ, కళాశాలలోని లెక్చరర్లు తమపై చూపిన ప్రేమాభిమానాలను ఎల్లప్పుడూ మర్చిపోలేమని ఏ స్థాయిలో ఉన్న సాధన కాలేజీని మర్చిపోకుండా కళాశాల బృందం అట్ట జ్ఞాపకాలను మిగిల్చారని ఉపన్యాసించారు, వారికి జీవితంలో కావలసిన అన్ని రకాల నైపుణ్యాలను వారు అందించారని, సాధన కాలేజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ గాజానవేని కుమార్ మాట్లాడుతూ…. విద్యార్థులు తమ ని వదిలి వెళుతున్నందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇన్ని రోజులు వారు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని, మంచి ప్రతిభను కనబరిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు, ఇలాగే మునుముందు, రానున్న జీవితంలో మరెన్నో విద్యా ప్రమాణాలను చేపట్టి, జీవితంలో ఉత్తమ స్థానాలలో స్థిరపడాలని కోరుకున్నారు, మీరు ఏ స్థాయిలో స్థిరపడ్డ మీరు ఎన్నడూ మాకు విద్యార్థులేనని తామెన్నడు వారిని మరువబోమని, కళాశాలలో చూపించిన క్రమశిక్షణనే, ఎక్కడికి వెళ్ళినా కళాశాల గౌరవాన్ని పేరు ప్రతిష్టలను నిలబెట్టాలని కోరుకున్నారు. రానున్న పరీక్షలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ వేడుకలో కళాశాల డైరెక్టర్లు అన్నాడి మల్లారెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, కళ్ళెం స్వామి రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.