📄 ePaper
Sunday, March 29, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircilla18 వ వార్డులో గెలుపు అవకాశాలుగుండ్లపెల్లి లత–శ్రీనివాస్ లకే  ప్రజల్లో...

18 వ వార్డులో గెలుపు అవకాశాలుగుండ్లపెల్లి లత–శ్రీనివాస్ లకే  ప్రజల్లో పెరుగుతున్న మద్దతు

📰 Generate e-Paper Clip

18 వ వార్డులో గెలుపు అవకాశాలుగుండ్లపెల్లి లత–శ్రీనివాస్ లకే

 

ప్రజల్లో పెరుగుతున్న మద్దతు

 

ప్రజావాణి సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గుండ్లపెల్లి లత–శ్రీనివాస్ జంట ప్రచారంలో ముందంజలో కొనసాగుతున్నారు. వార్డులో ప్రతి కాలనీ, ప్రతి వీధిని సందర్శిస్తూ ఓటర్లను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, స్వాగతం వారి గెలుపు అవకాశాలను మరింత బలపరుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రచార కార్యక్రమాల్లో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం. స్థానిక సమస్యల పరిష్కారంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రజల ముందుంచడం ద్వారా అభ్యర్థులు విశ్వాసాన్ని పొందుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, కాలువల నిర్మాణం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తామని వారు హామీ ఇస్తున్నారు.

గతంలో ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన అనుభవం, అందుబాటులో ఉండే స్వభావం గుండ్లపెల్లి లత–శ్రీనివాస్ జంటకు ప్రధాన బలంగా నిలుస్తోంది. “ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం” అనే నినాదంతో వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో 18వ వార్డులో ఎన్నికల వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే గుండ్లపెల్లి లత–శ్రీనివాస్ జంటకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular