📄 ePaper
Saturday, May 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip


కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) బద్వేల్ ఆర్డీవో సమావేశం మందిరం యందు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయి వర్క్ షాప్ వివిధ డిపార్ట్మెంటల్ తో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ చంద్రమౌళి.కౌమార దశలో గర్భధారణ నివారణకు ప్రతి ఒక్కరు గ్రామస్థాయి నుంచి డివిజనల్ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దీనివల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులు చేసి కౌమార దశలో గర్భాధ పరిస్థితులను నివారించాలనితెలిపారు.అంతేకాకుండా బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు గ్రామస్థాయి యందు సమావేశాలు నిర్వహించుకొని దానికి తగ్గట్టుగా నివారణ చర్యలు తీర్చే పట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ శ్రీమతి శోభారాణి.మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అందిస్తున్నటువంటి సేవలు గురించి వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది బాలలకు ఉన్న రక్షణ చట్టాల గురించి మరియు టీనేజ్ ప్రెగ్నెన్సీ తగ్గించుటకు గ్రామస్థాయి నుంచి డివిజనల్ స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు,మెడికల్ ఆఫీసర్లు, మండల విద్యాధికారులు,సిడిపివోలు సూపర్వైజర్లు మరియు మహిళా పోలీసులు,డిసిపియు,ఓఎస్సీ సిబ్బంది పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular