📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ బాధితుల పక్షానే నిలబడుతుం..హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తొలి సమావేశం

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ బాధితుల పక్షానే నిలబడుతుం..హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తొలి సమావేశం

📰 Generate e-Paper Clip

గుంటూరుప్రజావాణిన్యూస్(ఏప్రిల్13)గుంటూరు జెడ్పి సమావేశం హాల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ బాధితుల పక్షానే నిలబడుతుంది,రాజ్యాంగ వ్యవస్థకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య హక్కుల కోసం వారధిగా పనిచేస్తుంది.అవినీతిని నిర్మూలించడానికి సైనికుల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు పనిచేస్తారు.గుంటూరు జెడ్పి సమావేశం హాల్లో.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పటిష్టమైన వ్యవస్థతో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో న్యాయవ్యవస్థలో అనుభవం ఉన్నవారు, జర్నలిజంలో అనుభవం ఉన్నవారు, విశ్రాంత ప్రభుత్వ అధికారులు, విశ్రాంత పోలీసు అధికారులు అన్ని విభాగాలకు సంబంధించిన అనుభవజ్ఞులు సేవలందించడానికి ముందుకు వచ్చారని అలాంటి వారితో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు బాధితులు ముందుకు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ ఆర్.సారథిచౌదరి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ ఎం.వెంకటేశ్వర్లు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపకులు డాక్టర్ అంబూరి సింధుజ, డాక్టర్ అంబూరి మల్లికార్జున్ లు పిలుపునిచ్చారు.హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఐ & పి ఆర్ విభాగం రాష్ట్ర చైర్మన్ కోలా లక్ష్మీపతి అధ్యక్షతన గుంటూరు జెడ్పీ సమావేశం హాలులో తొలి కౌన్సిల్ సమావేశం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదికపై నుండి వక్తలు మాట్లాడుతూ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మిగతా సంస్థ లాగా విమర్శలకు తావు లేకుండా పనిచేస్తుందని అన్నారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఠాగూర్ లాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. మానవ హక్కుల ఉల్లంఘన సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కౌన్సిల్ సభ్యులు సైనికుల్లా పనిచేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పోలీస్ స్టేషన్లో బాధితులకు న్యాయం జరగనప్పుడు నిర్భయంగా కౌన్సిల్ సభ్యులను ఆశ్రయించవచ్చు అన్నారు. మానవ హక్కులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పోలీసులు న్యాయవాదులు సంస్కర్తలతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించేందుకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రణాళిక రూపొందించింది అన్నారు.ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కమిటీ సభ్యులకు, జిల్లా బాధ్యులకు మెమెంటోలు, నియామక పత్రాలు, సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రాష్ట్రం నలుమూలల నుండి గుంటూరు కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు రాష్ట్ర కేంద్ర ఆధారితంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు. గుంటూరులోని జిల్లాపరిషత్ కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర మానవహక్కులమండలి. (రి.నెం.17/2026) ప్రారంభోత్సవ కార్యక్రమం, సంస్థ ప్రధాన కార్యాలయం ప్రారంభించడం జరిగినది. రాజధాని అమరావతి కేంద్రంగా రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ తిరుపతి నగర కేంద్రంగా కూడా కౌన్సిల్ పనిచేస్తుందని వ్యవస్థాపకులు అంబూరి సింధుజ అంబూరి మల్లికార్జున్ లు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ ఆర్.సారథిచౌదరి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ,ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ ఎం.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ డా”అంబూరుసింధూజ, రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఆస్థాన గాయకులు బి.రఘునాథ్ ,రాష్ట్ర ఐ & పి ఆర్ చైర్మన్ కోలా లక్ష్మిపతి , రాష్ట్ర వైస్ చైర్మన్ గంటేడ మోహన్ ,రాష్ట్ర కార్యనిర్వాహక విభాగం వైస్ చైర్మన్ ఈవి మురళి ,రాష్ట్ర డిప్యూటీ చైర్మన్ ఎ. నాగసాయి కార్తీక్ ,రాష్ట్ర వెల్ఫేర్ విభాగం వైస్ చైర్మన్ సుమంత్ కుమార్,రాష్ట్ర వైద్యవిభాగం వైస్ చైర్మన్ డా’పుష్పలతచౌదరి , రాష్ట్ర సెక్రటరీ జనరల్ డా”ఎ.మల్లికార్జునరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎ. సోనియా, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీమంతుల సుమన్ , సామాజికవేత్త పేరం అనిత కుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకమిటీ, అన్ని జిల్లాల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular