సిద్దిపేట జిల్లా,
మార్చి 11, ప్రజావాణి
హుస్నాబాద్ గౌరవం పెరిగేలా మున్సిపల్ పాలకవర్గం అధికారులు పనిచేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపాల్ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై అవగాహన మరియు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ సభ్యుల సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించి మాట్లాడుతూ నేను 2009-2014 మధ్య పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహకారంతో వేములవాడ, జమ్మికుంట, హుజురాబాద్, హుస్నాబాద్ గ్రామాలను నగర పంచాయతీలుగా అప్గ్రేడ్ అయ్యాయని తర్వాత మూడు మున్సిపల్ కౌన్సిల్ లలో పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రజా పలన ప్రగతి ప్రణాళిక కార్యచరణ కార్యక్రమంలో 10 అంశాలలో రూపొందించిన కార్యక్రమాలతో పాటు 99 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేసి హుస్నాబాద్ పట్టణంను క్లీన్ అండ్ గ్రీన్ గా రూపొందించాలని, ప్రజల భాగస్వామ్యంతో ఇతర అభివృద్ధి పనులను నిర్వహించాలన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హుస్నాబాద్ లో రాజకీయాలకు అతీతంగా విద్యా, వైద్యం, పర్యాటకం అభివృద్ధిలో 250 పడగల ఆసుపత్రి నిర్మాణంలో ఉందని పీజీ విద్యార్థులు ఇందులో వైద్యం అందిస్తారని, ఇంజనీరింగ్ కళాశాల, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు, కొత్తచెరువు, అర్బన్ పార్క్, నాలుగు వరుసల రహదారి తదితర అభివృద్ధి చేశామని, 12, 13 వార్డులలో నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని, పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని పట్టణ ప్రముఖుల నుండి సలహాలు తీసుకొని ప్రజలపై అదనంగా పనులు వేయకుండా మున్సిపల్ ఆదాయం పెంచుకొని, 110 మంది మునిసిపల్ ఉద్యోగులు అందరూ పనిచేస్తూ పట్టణ అభివృద్ధి చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆదాయం పెరిగేలా బ్యాంకు లింకేజీ అందించామని, స్టీల్ బ్యాంక్ ను ఉపయోగించి ప్లాస్టిక్ నిరోధించాలని, నర్సరీలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వానికి మరింత దగ్గరగా అయ్యేలా రూపొందించిన కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అని ఈ కార్యక్రమంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈనెల 12వ తేదీ గురువారం నాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సర్పంచులకు, మున్సిపల్ చైర్మన్ లకు, కౌన్సిలర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనికి హాజరు కావాలని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పచ్చదనం, పారిశుభ్రత కార్యక్రమాలను చేపడతామని, 250 పడకల ఆస్పత్రి నిర్మాణంతో ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందుతాయని, గర్భస్థ క్యాన్సర్ రాకుండా వేసే వ్యాక్సిన్14 సంవత్సరాలు నుండి 15 సంవత్సరాల మధ్య గల బాలికలకు అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




