వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (మే13) కడప.జిల్లా పోలీస్ కార్యాలయం,హనుమాన్ శోభా యాత్రలో హిందూ ముస్లిం భాయ్ భాయ్.అని చాటి చెప్పిన సర్వమత సమ్మేళనం కార్యక్రమం.హిందూ సోదరులకు మజ్జిగ,మంచినీరు,కూల్ డ్రింక్స్ ఆప్యాయంగా పంపిణీ చేసిన ముస్లిం సోదరులు శోభా యాత్ర లో కలిసిమెలిసి పాల్గొని మత సామరస్యాన్ని,ఐక్యత చాటిన ముస్లిం,హిందూ మత పెద్దలను అభినందించిన జమ్మలమడుగు ఎం.ఎల్.ఏ శ్రీ ఆదినారాయణ రెడ్డి,జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్, టి.డీ.పీ ముస్లిం నాయకులు అమీర్ బాబు గారు కడప మే 12: కులమతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే..హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చాటిచెప్పి శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని నిరూపించడం అభినందనీయమని జమ్మలమడుగు ఎం.ఎల్.ఏ శ్రీ సి.ఆదినారాయణ రెడ్డి జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్,టి.డీ.పీ ముస్లిం నాయకులు అమీర్ బాబు,పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కడప నగరంలో హనుమాన్ జయంతి సందర్బంగా జరిగిన శోభా యాత్రలో ముస్లిం సోదరులు శోభాయాత్రకు హిందు సోదరులను ఆలింగనం చేసుకుని స్వాగతం పలకడం,యాత్రలో పాల్గొన్న హిందూ సోదరులకు ఒకరికొకరు ఆప్యాయంగా మజ్జిగ,నీరు,పానీయాలు అందించడం అభినందనీయమని జమ్మలమడుగు ఎం.ఎల్.ఏ శ్రీ సి.ఆదినారాయణ రెడ్డి,జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ పేర్కొన్నారు.ఇది హిందూ ముస్లిం ఐక్యతను ప్రతిబింబిస్తుందన్నారు.హిందూ ముస్లిం అంతా ఒక్కటే అందరు కలిసి ముందుకు పోవాలి కడప నగరంలో హిందూ,ముస్లిం,క్రిస్టియన్ లు అందరు కలిసి మెలిసి ఉన్నారన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకులు అమీర్ బాబు మాట్లాడుతూ కడప జిల్లాలో తరతరాలుగా హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా అందరూ సమైక్యంగా ఉంటూ ఒక కుటుంబంలా జీవిస్తున్నారని,చారిత్రక కడప అమీన్ పీర్ దర్గా,దేవుని కడప వెంకటేశ్వర స్వామి,మరియాపురం క్యాతడ్రల్ చర్చి ఉన్నాయని గుర్తుచేశారు. హిందూ ముస్లిం పెద్దలు సర్వమత సమ్మేళనం కార్యక్రమం నిర్వహించి అసాంఘిక శక్తుల కుట్రను విఫలం చేశారన్నారు.నగరంలో అందరూ కలిసి,మెలిసి ఉండాలనే భావనలో ఉన్నారని,కడపలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని,హిందూ ముస్లిం సోదరులలోని అమాయకులను జిల్లా పోలీస్ శాఖ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తుందని జిల్లా ఎస్.పీ తెలిపారు. కార్యక్రమంలో టి.టి.డి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, హిందూ,ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



