వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)అగ్రహారం గ్రామంలో హత్యకు పాల్పడ్డ దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం .. ఖాజీపేట లో హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులకు జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ భరోసా ఖాజీపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో బాలిక హత్యకు పాల్పడ్డ దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని బాలిక కీర్తన తల్లిదండ్రులకు జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం కడప నగరంలోని జిల్లా ఎస్.పీ గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్.పీ గారిని హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులు కలిసి తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్.పీ గారిని కలిసి విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పీ గారు వారికి హామీ ఇచ్చారు.జిల్లా పోలీస్ కార్యాలయం, కడప
Homeఆంధ్రప్రదేశ్హత్యకు పాల్పడ్డ దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం,,జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్...
హత్యకు పాల్పడ్డ దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం,,జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ భరోసా
0
12
RELATED ARTICLES

