
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) గోపవరం మండలంకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి వచ్చిన 7 ట్రై సైకిల్స్ ను మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మి, పంచాయితీ అభివృద్ధి అధికారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఇంటి నుండి తడి మరియు పొడి చెత్త సేకరణకు ఈ ట్రై సైకిల్స్ ను సక్రమంగా ఉపయోగించుకుని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో ఎంపీడీవో,శ్రీధర్, హసీనా పార్టీ నాయకులు కొండయ్య, మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

