📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyస్నేహమేరా జీవితం – స్నేహమేరా శాశ్వతం చిన్ననాటి మిత్రులు ఒకేచోట కలిసిన శుభవేళ ...

స్నేహమేరా జీవితం – స్నేహమేరా శాశ్వతం చిన్ననాటి మిత్రులు ఒకేచోట కలిసిన శుభవేళ 1990–1991 ఎస్ఎస్సి బ్యాచ్ గెట్ టూ గెథెర్ సందడి

📰 Generate e-Paper Clip

స్నేహమేరా జీవితం – స్నేహమేరా శాశ్వతం

చిన్ననాటి మిత్రులు ఒకేచోట కలిసిన శుభవేళ

1990–1991 ఎస్ఎస్సి బ్యాచ్ గెట్ టూ గెథెర్ సందడి

స్నేహం అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా 1990–1991 ఎస్ఎస్సి బ్యాచ్‌కు చెందిన చిన్ననాటి మిత్రులు షాద్‌నగర్ పట్టణంలోని మా కన్వెన్షన్‌లో ఘనంగా గెట్ టూ గెథెర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్నో ఏళ్ల తర్వాత ఒకేచోట కలిసిన చిన్ననాటి స్నేహితులు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, పాఠశాల రోజుల ముచ్చట్లు, కలిసి చేసిన సరదా సంఘటనలను పంచుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమం మొత్తం ఆత్మీయత, ఆనందోత్సాహాల నడుమ కొనసాగింది.

ఈ సందర్భంగా స్నేహితులు తమ తమ జీవిత అనుభవాలను పంచుకుంటూ, ఇలాంటి సమావేశాలు మరింత తరచుగా నిర్వహించుకుని అందరూ ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు.

పాత జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందుకు రావడంతో ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. చిన్ననాటి స్నేహబంధం ఎంత గొప్పదో ఈ గెట్ టూ గెథెర్ మరోసారి గుర్తు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular