చిలుకూరు మార్చి09(ప్రజావాణి*):చిలుకూరులో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా వచ్చిన ఐదు లక్షల రూపాయలతో 10 వి వార్డులో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు చిలుకూరు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఎంపీడీవో నరసింహారావు శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అన్ని వార్డులో సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్ తెలిపారు. పనులను నాణ్యతతో,వేగంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, పంచాయతీ కార్యదర్శి షరీపుద్దీన్,అలసగాని జనార్ధన్, గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ సోంద్,షాఖీర్,అఖిలపక్ష నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్*
0
13




