📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaవిద్యుత్ కార్మికుల సమస్య పరిష్కారానికి 1104 యూనియన్ ముందంజ

విద్యుత్ కార్మికుల సమస్య పరిష్కారానికి 1104 యూనియన్ ముందంజ

📰 Generate e-Paper Clip

*విద్యుత్ కార్మికుల సమస్య పరిష్కారానికి 1104 యూనియన్ ముందంజ*

*విద్యుత్ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో చందూర్ సబ్ స్టేషన్ ఆవరణలో సోమవారం మేడే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కోశాధికారి యం.డి.షరీఫ్ పాష మేడే జండా ను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం బాణాసంచాలతో మేడే సంబురాలు జరిపారు. అనంతరం ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన 1104 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శి ఎన్. వెంకటయ్య గారు భార‌త లైన్‌లో మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నిరంతరం విద్యుత్ సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ 1104 యూనియన్ అని అలాగే సంస్థలో విద్యుత్ కార్మికులు నిరంతరం కష్టపడి 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, ఆర్టిజన్ కార్మికులకు ల వారీగా విద్యుత్ ప్రమోషన్లు కల్పించాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతన సవరణ, విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరిగి, పని చేసే సంస్థలకు పని కల్పించాలని సూచించారు. చేస్తున్నటువంటి కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన నిర్ణయించారు. సమావేశనంతరం డివిజన్ కోశాధికారి షరీఫ్ పాష ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, డివిజన్ నాయకులను షాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కార్య నిర్వహణ అధ్యక్షులు, డివిజన్ కార్యదర్శి టి.శ్రీనివాసులు, డివిజన్ అధ్యక్షులు రాంబాబు, డివిజన్ అదనపు కార్యదర్శి ఆర్.బాలు నాయక్, డివిజన్ కోశాధికారి యం.డి. షరీఫ్ పాష, డివిజన్ జైంట్ కార్యదర్శి లింగయ్య, డిస్కం ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ముత్తయ్య, చండూర్ సెక్షన్ లీడర్ షజ్జు పాష, సబ్ డివిజన్ లీడర్ అశోక్, ఎల్లేశం, ముత్యంరెడ్డి, దోటి శ్రీను, యం.వెంకన్న, సైదులు, యాసిన్, రమేష్, అద్దంకి వెంకన్న, సురేష్, మీటర్ రీ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular