విజయవాడ ప్రజావాణిన్యూస్(మార్చి26)రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూరీ-తిరుపతి ఎక్స్ప్రెస్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో ఈగల్ మరియు ఆర్పీఎఫ్ (RPF) సిబ్బంది సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.రైలులోని ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయగా,సుమారు 65 కేజీల గంజాయి లభ్యమైంది. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈగల్ టీం సీఐ రవీంద్ర మాట్లాడుతూ.నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది,ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నామన్నారు.మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని,స్టేషన్లలో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు
విజయవాడ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి సీజ్… 8 మంది అరెస్టు
0
8
- Advertisment -



