📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వంటిమామిడి మార్కెట్ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

వంటిమామిడి మార్కెట్ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

📰 Generate e-Paper Clip

 

వంటిమామిడి మార్కెట్ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

 

సిద్దిపేట పోలీస్ కమిషనర్ యస్. రష్మీ పెరుమాళ్, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు, రాజీవ్ రహదారిపై ప్రయాణికులకు మరియు రైతులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఈరోజు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఏసీపీ యం. సుమన్ కుమార్ ఆధ్వర్యంలో, వంటిమామిడి మార్కెట్ ప్రాంతంలో గజ్వేల్ ట్రాఫిక్, గజ్వేల్ రూరల్, గౌరారం మరియు ములుగు పోలీసులు సంయుక్తంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు.రాజీవ్ రహదారిపై వాహనదారులకు, ముఖ్యంగా మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మరియు గజ్వేల్ రూరల్ సిఐలను ఏసీపీ సుమన్ కుమార్ ఆదేశించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ మాట్లాడుతూ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సైలకు సూచించారు. రోడ్డు నియమాలు పాటించని వాహనదారులకు ఈ సందర్భంగా జరిమానాలు విధించారనీ తెలిపారు. ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి, గజ్వేల్ రూరల్ సిఐ రవి రాజు, ఎస్సైలు కరుణాకర్ రెడ్డి, దామోదర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular