ప్రజావాణిన్యూస్(మార్చి15)గుంటూరుజిల్లా పోలీస్ లిక్విడ్ గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన పాత గుంటూరు పోలీసులు,గుంటూరు జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పాత నేరస్తులపై నిఘా పెట్టి, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులకు గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు.గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈస్ట్ డి.ఎస్పి శ్రీ అబ్దుల్ అజీజ్ గారిని పర్యవేక్షణ లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ వెంకట ప్రసాద్ గారు తన పరిధిలో గంజాయి,లిక్విడ్ గంజాయి,ఇతర మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్న గంజాయి అమ్మే వారి పై నిఘా పెట్టి, వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఎవరైనా గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తుంటే, వారిపై ఆకస్మిక దాడులు నిర్వహించి అరెస్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వస్త్ర నగర్ లోని ఖాళీ స్థలం లో లిక్విడ్ గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుండి ఒక కిలో (1 liter) లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.కేసు వివరాలు గుంటూరుకు చెందిన షేక్ మహబూబ్ భాషా @ భాషా @ అక్బరి @ 220 భాషా S/o హనీఫ్,వ.34 సం.లు.కులము:ముస్లిం,నివాసము.5వ లైను, మసీద్ దగ్గర, తారకరామ నగర్,పాత గుంటూరు,గుంటూరు టౌన్ అనే అతను గంజాయి త్రాగడానికి అలవాటు పడి, తమ చెడు వ్యసనాలను తీర్చుకోవడానికి మరియు సులువుగా ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయము తీసుకోని, లిక్విడ్ గంజాయి కోసము అరకు వెళ్లి అక్కడ లంబసింగి వాటర్ ఫాల్స్ దాటిన తరువాత అన్నారము వద్ద ఛత్రపతి, కొండలరావు అనువారి వద్ద నుండి లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేసి గుంటూరు తీసుకొని వచ్చి, అందులో అతను కొంత లిక్విడ్ గంజాయి త్రాగుతూ, కొంత అమ్ముకునే వాడు, ఈ క్రమము లో సుమారు 4 రోజుల తన వద్ద లిక్విడ్ గంజాయి అయి పోయి నందువలన ఛత్రపతి, కొండలరావు లకి ఫోన్ చేయగా వాళ్ళు రెండురోజుల తరువాత ఫోన్ చేయమనగా నేను ది.14.03.2026 వ తేదిన లిక్విడ్ గంజాయి కావాలని ఫోన్ చేయగా వాళ్ళు ఈరోజున అనగా ది 15.03.2026 వ తేదిన గంటలకు గుంటూరు వచ్చి అతను చెప్పినట్లు వస్త్రనగర్ లోపల ఖాలీ ప్రదేశమువద్దకు వచ్చి ఉండగా పోలీస్ వారు వచ్చి లిక్విడ్ గంజాయి ని స్వాదీన పరచుకొని, నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది.పట్టుబడిన నిందితుల వివరాలు :-
1).షేక్ మహబూబ్ భాషా @ భాషా @ అక్బరి @ 220 భాషా S/o హనీఫ్,వ.34 సం.లు.కులము:ముస్లిం నివాసము.5వ లైను,మసీద్ దగ్గర,తారకరామ నగర్,పాత గుంటూరు,గుంటూరు టౌన్,
2)తాబెలి ఛత్రపతి S/o కృష్ణ రావు,వ.16 సం.లు,కులము.కోండులు నివాసము గొడ్డలి కర్ర గ్రామము,జి. మాడుగుల మండలము,అల్లూరి సీతారామరాజు జిల్లా,(juvenile )3).తామిలి కొండల రావు S/o రామారావు,వ.22 సం.లు.కులము.కోండులు నివాసము గొడ్డలికర్ర గ్రామము,జి.మాడుగుల మండలము, అల్లూరి సీతారామరాజు జిల్లాఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఈస్ట్ స్ డిఎస్పి గారు అయిన శ్రీ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ,గుంటూరు జిల్లా ఈస్ట్ సబ్ డివిజన్ లో గంజాయి మహమ్మారిని కూకటివేళ్ళతో పెకలించి,నిర్మూలించడానికి పటిష్ట ప్రణాళికలు రూపొందించామని,పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి,ఈగల్(EAGLE) టీం వారితో సమన్వయం చేసుకుంటూ గంజాయి విక్రయం,వినియోగం మరియు సరఫరా చేసే వారిని కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి కేసుల్లోని పాత నేరస్తులపై నిఘా పెట్టి, వారి కదలికలు, వారు చేసే పనులు, వారి జీవన విధానం,వ్యవహార శైలి వంటివి పరిశీలిస్తూ ఎక్కడైనా ఏవైనా అనుమానాస్పద విషయాలు వారిలో కనిపిస్తే వెంటనే వారిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.తరచుగా గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం మరియు నూతన PIT NDPS చట్టం ప్రకారం కూడా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.పై కేసులో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన గుంటూరు ఈస్ట్ డి.ఎస్పి శ్రీ అబ్దుల్ అజీజ్ గారిని,పాత గుంటూరు సిఐ శ్రీ వెంకట ప్రసాద్ గారిని ఎస్సై ఎం రోశయ్య గారిని మరియు సిబ్బంది మోహన్, నూరుద్దీన్, రామరావు ను గుంటూరు జిల్లా ఎస్పి శ్రీ వకుల్ జిందాల్, IPS గారు అభినందించినారు.
లిక్విడ్ గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన పాత గుంటూరు పోలీసులు
RELATED ARTICLES




