📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కెనాల్ నీరు ఎక్కువగా విడుదల… రైతుల్లో ఆందోళన

కెనాల్ నీరు ఎక్కువగా విడుదల… రైతుల్లో ఆందోళన

📰 Generate e-Paper Clip

 

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో కెనాల్ నుండి అధికంగా నీరు విడుదల చేయడంతో రైతులు వెళ్లే దారిపైకి నీరు వచ్చి ప్రవహిస్తోంది. దీంతో కెనాల్ ఎక్కడైనా తెగిపోయి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గం మొత్తం నీటితో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనాల్ వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇలాగే నీరు కొనసాగితే పంటలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామ రైతులు ప్రభుత్వం మరియు నీటిపారుదల శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular